గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఎంపీడీవో మల్లేశ్వరి, ఎంపీవో జక్కుల గణేశ్​ గాంధీ, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య దేవా నాయక్, 
మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేకు వినతి 

టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని బోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్యకు బోడు యూత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. శుక్రవారం మండలంలోని బోడు పరిధిలోని పలు గ్రామాల్లో అభివృధ్ది పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యేకు బోడు యూత్​ కమిటీ సభ్యులు కల్తీ చంద్రశేఖర్, మాడే చంద్రశేఖర్, మేకల సతీశ్​, ఎట్టి ప్రశాంత్, నల్లబోతుల సతీశ్​ కలిసి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్బంగా యూత్​ సభ్యులు మాట్లాడుతూ బోడు పరిసర ప్రాంతాలు పూర్తిగా ఆదివాసి, గిరిజనలు నివసించే ప్రాంతాలైనందున బోడును మండలంగా ప్రకటిస్తే ప్రజాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.