గుజరాత్‌లో పవర్ హాలిడేలు.. బీఆర్ఎస్‌ తోనే అభివృద్ధి సాధ్యం: కేపీ వివేకానంద

గుజరాత్‌లో పవర్ హాలిడేలు.. బీఆర్ఎస్‌ తోనే అభివృద్ధి సాధ్యం: కేపీ వివేకానంద

హైదరాబాద్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు.  కుత్బుల్లాపూర్‌లోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలో పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం వివేకానంద మాట్లాడుతూ.. "బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణను స్వర్గధామంగా మార్చింది. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మూడో సారి బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలి. పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.

ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు కోతలు విధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని మళ్లీ గెలిపించి రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాలి. విపక్షాల కుతంత్రాలను తిప్పికొట్టాలి." అని కామెంట్స్ చేశారు.