శ్రీరాముడ్ని అడిగితే కూడా బండి సంజయ్కు ఓటేయద్దంటడు : కేటీఆర్

శ్రీరాముడ్ని అడిగితే కూడా బండి సంజయ్కు ఓటేయద్దంటడు  : కేటీఆర్

జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను  కేంద్రపాలిత ప్రాంతంగా  మార్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఈ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో గులాబీ జెండా ఉండాలని పిలుపునిచ్చారు.  మన అవసరాలు తీరకుండా గోదావరి నీటిని తరలించే ప్రయత్నాలను ఆపాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలుగా ఉండాలన్నారు.  కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ క్యాడర్ మీటింగ్ లో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.  

2014లో బడే భాయ్ మోడీ, 2023లో చోటే భాయ్ రేవంత్ రెడ్డి అనేక హామీలిచ్చి జనాలను మోసం చేసారని మండిపడ్డారు కేటీఆర్.  రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తో పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తో పంచాయితీ లేదని, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని బండి సంజయ్ ఇప్పటికే చెప్పాడన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  తాను ఓడిపోయిననే బాధకంటే బీఆర్ఎస్ అధికారంలో నుండి పోయిందన్న సంతోషమే బండి సంజయ్ కు ఎక్కువగా ఉందన్నారు. బండి సంజయ్ కు జై శ్రీరామ్ ఒక్కటే తెలుసని విమర్శించారు. శ్రీరామున్ని అడిగితే కూడా బండి సంజయ్ కు ఓటేయద్దనే చెబుతాడన్నాడన్నారు.  

కరీంనగర్ లో త్రిముఖ పోటీని, ద్విముఖ పోటీగా మార్చింది రేవంత్ రెడ్డినే అని చెప్పారు కేటీఆర్. గాలి తిరుగుళ్లు తిరిగే బండి సంజయ్ ను ఓడిద్దామని పిలుపునిచ్చారు. మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీల పరిధిలో దృష్టి సారిస్తే.. కరీంనగర్ లో బీఆర్ఎస్  గెలుపు ఈజీ అవుతుందన్నారు. ఇక  మల్కాజిగిరి, చేవేళ్లలాంటి చోట్ల కాంగ్రెస్ డమ్మీలను పెడితే, మిగతా చోట్లలో బీజేపీ డమ్మీలను పెట్టిందన్నారు.  కాంగ్రెస్ లేదంటే బీజేపీ గెలవాలన్న అండర్ స్టాండింగ్ తో ఆ పార్టీ నాయకులు  పోతున్నారన్నారని తెలిపారు.