
- రూ.665 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రికొత్తగూడెం/ సుజాతనగర్, వెలుగు : కొత్తకూడెం నియోజకవర్గంలో సోమవారం ఒకేరోజు రూ.665 కోట్ల విలువైన 103 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో రూ.665 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
పనుల్లో నాణ్యతకు ఆఫీసర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రోగ్రాంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి.వీరబాబు, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.