గో ఆధారిత..వ్యవసాయం మంచిది : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

 గో ఆధారిత..వ్యవసాయం మంచిది : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : గో ఆధారిత వ్యవసాయం మంచిదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్లలోని ఓ గార్డెన్​లో అఖిల భారత గో సేవ ఫౌం డేషన్  నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గతంలో గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్లే అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఫర్టిలైజర్స్  వాడకంతో నాణ్యమైన  ఆహారం దొరకడం లేదన్నారు. 

జడ్చర్లలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న విశ్వశాంతి మహాయాగం  ఏర్పాట్లను కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ దోరేపల్లి లక్ష్మీరవిందర్, జడ్పీ వైస్​ చైర్మన్​ కోడ్గల్​ యాదయ్య, రామ్మోహన్, మన్యం గోవర్ధన్​రెడ్డి, శ్రీకాంత్​ పాల్గొన్నారు.