ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరిలో ఐదోసారి ప్రజా దర్బార్ నిర్వహించారు ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు. శివ నగర్, అంబేడ్కర్ నగర్, ఆకుల నారాయణ, టెలిఫోన్ కాలనీల్లోని  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీటి సమస్యలను స్థానికులు ప్రస్తావించగా.. ఎమ్మెల్యే మైనంపల్లి స్పందించి సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. చిన్న చిన్న సమస్యలు కూడా పెండింగులో పెడితే ఎలా..? రోడ్లు, తాగునీటి సమస్యలు చాలా ప్రధానమైనవి.. ఇలాంటి ప్రధానమైన సమస్యలను,  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశించారు. రేపు ఉదయం కుళాయిలకు నీళ్లు వదిలినప్పుడు అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారని స్థానికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఎమ్మెల్యే నిర్వహించిన ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి

యాదాద్రి ఆలయం హుండీ లెక్కింపు..7రోజుల ఆదాయం ఎంతంటే

నీళ్ల కోసం ఢిల్లీ వాసుల గోస.. క్యాన్‌‌లకు తాళాలు