యాదాద్రి ఆలయం హుండీ లెక్కింపు..7రోజుల ఆదాయం ఎంతంటే

యాదాద్రి ఆలయం హుండీ లెక్కింపు..7రోజుల ఆదాయం ఎంతంటే

యాదగిరిగుట్ట : లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించారు. గత వారం రోజులు ( 7 రోజుల) హుండీ) ఆదాయం 5లక్షల 9వేల 88 రూపాయల నగదు వచ్చింది. అలాగే నగదుతోపాటు ఆభరణాలు, విదేశీ కరెన్సీ కూడా భక్తులు కానుకగా సమర్పించుకున్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత భక్తులకు దర్శనావకాశం రావడంతో భారీగా తరలివస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు సైతం యాదగిరిగుట్టకు వచ్చి దర్శించుకుంటుండడంతో గతంలో కంటే ఇప్పుడు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి హుండీకి భక్తులు సమర్పించిన ఆభరణాలు, విదేశీ కరెన్సీల వివరాలు ఇలా ఉన్నాయి. 

మిశ్రమ  బంగారం 0-134-000 గ్రాములు...

మిశ్రమ వెండి కిలో 1-150-000 గ్రాములు...

విదేశీ కరెన్సీ..

ఆస్ట్రేలియా -25 డాలర్లు
అమెరికా -109 డాలర్లు
సౌదీ అరేబియా -1రియల్స్
కెనడా -5 డాలర్స్
సింగపూర్ 5 డాలర్స్

 

ఇవి కూడా చదవండి

నీళ్ల కోసం ఢిల్లీ వాసుల గోస.. క్యాన్‌‌లకు తాళాలు

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన