రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రం చల్లబడుతోంది. ఎండలతో తల్లడిల్లిన ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల గాలుల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్,  నారంపేట్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 

గత కొద్ది రోజుల కిందట భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెల నుంచే సూర్యుడు ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జనాలు జంకారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలపైగానే నమోదు కావడం... వడగాలులు వీచడంతో వడదెబ్బతో కొంతమంది పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే.. రుతుపవనాల విషయంలో IMD గుడ్ న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన సంగతి తెలిసిందే. దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ దీవుల వరకు ఇవి విస్తరించినట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నాటికి కేరళలను తాకుతాయని, తెలంగాణలో జూన్ మొదటి వారంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. 

మరిన్ని వార్తల కోసం : -

వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?

 

గూడు కూల్చారు.. బాత్రూమే ఇల్లయ్యింది