గూడు కూల్చారు.. బాత్రూమే ఇల్లయ్యింది

గూడు కూల్చారు.. బాత్రూమే ఇల్లయ్యింది

ఉన్న గుడిసే తీసేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని నమ్మించారు. ఇప్పటికీ ఏళ్లూ గడుస్తున్నా ఇండ్లు లేవు. ఇప్పుడు ఇళ్లు లేక చిన్నపాటి బాత్రూమ్ లోనే కాలం గడుపుతున్నారు. ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయలో అర్థం కాని పరిస్థితుల్లో చెంచులు గుడుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ లోని చెంచుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 

హబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ చిన్నయ్యపల్లిలో చెంచు కర్రె లక్ష్మమ్మ గత కొన్నేళ్లుగా బాత్రూమ్ లోనే జీవనం కొనసాగిస్తోంది. బాత్రూమ్ లోనే వండుకోవడం, తినడం, పడుకుంటోంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇంటిని అధికారులు కూల్చేశారు. ఏళ్లు గడుస్తున్న ఇల్లు రాకపోవడంతో బాత్రూంనే ఇంటిగా చేసుకుంది లక్ష్మమ్మ.  

2019లో పల్లెప్రగతిలో భాగంగా ఉన్న పాత ఇండ్లను కూల్చేశారు. కూల్చేసిన పాత ఇండ్ల స్థానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్ మంజూరు చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇండ్లు కట్టించలేదు. దీంతో సొంత ఖర్చులతో గుడిసెలు వేసుకున్నారు చెంచులు. ఇక్కడ ప్రస్తుతం 100 చెంచు కుటుంబాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరకీ కూడా ఉండటానికి సొంతిల్లు లేదు. పూరి గుడిసెల్లోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. రాత్రంతా భయంతో జాగారం చేస్తున్నారు. వీరికి ఉందమంటే ఇల్లు లేదు. పని చేసుకుందామంటే పనిలేదు. సాగు చేసుకుందామంటే భూమి లేదు. సర్కార్ పెన్షన్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి రూ. 30 వేలు ఇస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని లోకల్ లీడర్లు బేరం పెడుతున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు. 

తమకు ఇండ్లు కట్టిస్తే తమ బతుకు తాము బతికేస్తామంటున్నారు చెంచులు. ఉన్నదాంట్లో తృప్తిగా ఉన్న తమను డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో అనాథల్ని చేశారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనికరిస్తాలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం