మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం

రంగారెడ్డి జిల్లా మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ వార్డ్ పాశ్ కాలనీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లెలగూడా గీతాంజలి సేవా కేంద్రం బ్లడ్ బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బ్లడ్ బ్యాంకు నెలకొల్పడం శుభపరిణామమని, కరోనా సమయంలో రక్త నిల్వలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని మంత్రి సబిత గుర్తు చేశారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరువలేనివని, వారు చేసిన సేవలు అభినందనీయమన్నారు. రక్తదానం ప్రతి ఒక్కరూ చేసి, ఇతరులకు సహాయ పడాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

17 రోజుల తర్వాత ప్రగతిభన్ కు కేసీఆర్

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత