మల్కాజ్ గిరిలో కాంగ్రెస్, బీజేపీలకు క్యాడర్ లేదు: మల్లారెడ్డి

మల్కాజ్ గిరిలో కాంగ్రెస్, బీజేపీలకు క్యాడర్ లేదు: మల్లారెడ్డి

హైదరాబాద్:   దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రావిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. శుక్రవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి పార్లమెంటులోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మేయర్లు, నాయకులు ఉన్నారని.. కానీ, ప్రత్యర్థ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లకు క్యాడర్ లేదన్నారు. కాబట్టి.. లక్ష్మారెడ్డి విజయం ఖాయమని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాల బీఅర్ఎస్ పరిపాలనలో ప్రజలు  ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారన్నారు.బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన చారిటీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందించాడు.. ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్లారెడ్డి కోరారు.