గంగాధర, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో యాసంగి సాగుకు సంబంధించి చివరి మడి వరకూ సాగు నీరిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు శనివారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పంపుల వద్ద ఎల్లంపల్లి జలాలకు ఎమ్మెల్యే పూజలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పంటలకు నీరందించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే అక్రమ కేసులు పెట్టి, అర్ధరాత్రి అరెస్టులు చేశారన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని వాటర్ హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు.
నారాయణపూర్ నిర్వాసితులను రూ.23.50 కోట్లు మంజూరు చేయించానని, రానున్న రోజుల్లో మరో రూ.20 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తాను అడగగానే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను విడుదల చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కురిక్యాల ప్యాక్స్ మాజీ చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేశ్, సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
