అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది : ఎమ్మెల్యే రఘునందన్ రావు

అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది : ఎమ్మెల్యే రఘునందన్ రావు

మునుగోడు బైపోల్ లో నాలుగు రౌండ్ల లెక్కింపులో చూపిన వేగం... ఐదవ రౌండ్లో  ఎందుకు తగ్గిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. నాలుగు రౌండ్లలో ఎక్కువ మంది అభ్యర్థులు లేరా.... ఐదవ రౌండ్ లోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారా.... అని నిలదీశారు. రిజల్ట్స్ ను ఫేర్ గా అందించాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తున్నారన్న ఆయన.. మొదటి నాలుగు రౌండ్ల వెంటనే ప్రకటించారు.. ఐదవ రౌండ్ కు ఎందుకు లేట్ అయ్యిందని ప్రశ్నించారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. 

అనుభవం లేని అధికారులు కౌంటింగ్ లో ఉన్నారని రఘునందన్ రావు ఆరోపించారు. అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోందన్న ఆయన... ఎన్నికల కమిషన్ ఫలితాలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. మొదటి రౌండ్ రిజల్ట్స్ ఏ విధంగా అప్డేట్ చేశారో ..అదే విధంగా లాస్ట్ రౌండ్ పలితాలు పెట్టాలన్నారు. 1,2,3,4 రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరా? .. అని నిలదీసిన రఘునందన్ రావు.. దీనిపై ఎవరెవరికి ఫిర్యాదు చేయాలనేది పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.