దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తాం : రఘునందన్ రావు

దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తాం : రఘునందన్ రావు

తొగుట, ( రాయపోల్ ) వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై మరోసారి కాషాయ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని ముంగిసపల్లి, వీరనగర్, అంకిరెడ్డి పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పదేళ్లు ఎంపీగా ఉండి దుబ్బాకపై సవతి తల్లి ప్రేమ చూపించిన కొత్త ప్రభాకర్ రెడ్డి మళ్లీ గెలిపిస్తే అభివృధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  దుబ్బాక లో పోటీలో ఉండి గజ్వేల్, సిద్దిపేటకు నిధులను మంజూరు చేస్తున్నాడని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రజలు, యువకులు ఆలోచన చేయాలని సూచించారు. గడిచిన 10 ఏండ్లలో ఎన్ని నిధులు మంజూరు చేశారో వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మంతురు ఉప సర్పంచ్ రూపనర్సింలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో వెంకట్ గౌడ్, స్వామి, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ గౌడ్, నర్సింలు, లక్ష్మణ్, వెంకట్ గౌడ్, తిరుపతి రెడ్డి, చంద్రం, కృష్ణ పాల్గొన్నారు.

దుబ్బాక : అక్భర్​పేట-భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్​ఎస్ నాయకులు ఎమ్మెల్యే రఘునందన్​రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి కార్యకర్తలను పట్టించుకునే స్థితిలో లేరని ఆరోపించారు.  ఎన్నికల్లో రఘునందన్​రావు గెలుపు కోసం సైనికుల్లా పని చేస్తామని తెలిపారు.