ఉభయ రాష్ట్రాల్లోని ఆలయాలను టీటీడీ దత్తత తీసుకోవాలి

V6 Velugu Posted on Apr 04, 2021

ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయన్ని దూపదీపనైవేద్యాలకు కేటాయించాలన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘునందన్ రావు..శ్రీవారి హుండీ ఆదాయాన్ని ధర్మప్రచారానికి కనీసం 10 శాతం కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. తన నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని.. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించే శక్తినివ్వాలని శ్రీవారిని వేడుకున్నానన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను ప్రభుత్వం అడ్డుకోకపోవడం లేదన్నారు. తిరుపతి చుట్టుపక్కల జరుగుతున్న అన్యమత ప్రచారాలను అరికట్టే విధంగా టీటీడీ చర్యలు తీసుకోవాలన్నారు.

Tagged Telangana, AP, tirumala, MLA

Latest Videos

Subscribe Now

More News