పార్టీ నేతలతో చర్చించిస్టేట్ చీఫ్​నునియమించండి : ఎమ్మెల్యే రాజాసింగ్

పార్టీ నేతలతో చర్చించిస్టేట్ చీఫ్​నునియమించండి : ఎమ్మెల్యే రాజాసింగ్
  • బీజేపీ హైకమాండ్​కు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ కొత్త చీఫ్ నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్ ని కోరారు. దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలన్నారు. శుక్రవారం ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానానికి  వీడియో ద్వారా సూచించారు.

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇతర సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.