ఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా?

ఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా?

ఆంధ్ర నుంచి కరోనా ట్రీట్‌మెంట్ కోసం వచ్చే వారిని ఆపడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బార్డర్‌లో ప్రభుత్వ తీరు సరైంది కాదని ఆయన మండిపడ్డారు. ‘ఫస్ట్ ట్రీట్మెంట్.. ఆ తర్వాతే డాక్యుమెంట్స్! ఈ సమయంలో రాజకీయాలు కాదు.. సేవ ముఖ్యం. ఆంధ్రా వారి ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా? హైదరాబాద్ మెడికల్ హబ్ అని సీఎం కేసీఆర్ అంటారు. అలాంటప్పుడు మంచి ట్రీట్మెంట్ కోసం వస్తే డాక్యుమెంట్స్ కావాలా? ఆంధ్రకు పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తానంటావు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోవా? డాక్యుమెంట్స్‌ను కారణంగా చూపుతూ వైద్యం ఆపొద్దని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడం వల్ల ఇద్దరు పేషెంట్స్ మరణించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాల పరిస్థితి ఏంది?’ అని రాజా సింగ్ ప్రశ్నించారు.

https://www.facebook.com/RajaSinghHyderabad/posts/4142757042411980