రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బేగంబజార్ బంద్

రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బేగంబజార్ బంద్

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుపై బేగంబజార్ వ్యాపారులు స్పందించారు. పాత కేసుల్లో రాజాసింగ్ ను అరెస్టు చేసిన వెంటనే మార్కెట్లో దుకాణాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా మూతపడ్డాయి. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించడంతో బేగంబజార్ తోపాటు  ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ తదితర మార్కెట్లో ఉన్న దాదాపు వెయ్యి దుకాణాల వ్యాపారాలు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి రాజాసింగ్ కు మద్దతుగా నిలిచారు. 


భారీగా పోలీసుల మొహరింపు

ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన వెంటనే అఫ్జల్ గంజ్, షాహినాయత్ గంజ్, బేగం బజార్ తదితర మార్కెట్లలో పోలీసు బలగాలను మొహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి తెరచి ఉన్న దుకాణాలను ముసివేయాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.