హిందువుల గురుంచి మాట్లాడితే జైల్లో పెడతారా..పెట్టుకోండి

హిందువుల గురుంచి మాట్లాడితే జైల్లో పెడతారా..పెట్టుకోండి

ఊపిరి ఉన్నంత వరకు హిందువులు, దేవుడు గురించే మాట్లాడతానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందువునని..తనకు రాజకీయం చేయడం రాదన్నారు. దేశాన్ని హిందూ దేశంగా చేయాలనదే తన కల అని చెప్పారు.  రాజకీయాలు తన ఎడమ కాలుతో సమానమని వ్యాఖ్యానించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని....తనకు ఇంకేం కావాలన్నారు. గోషామహల్ తనకు మొదటి ఇల్లు అయితే..జైల్ తనకు రెండో ఇళ్లు అని చెప్పారు. శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న రాజాసింగ్..శోభాయాత్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

జైల్లో పెడతారా..పెట్టుకోండి..

దేవుడు,హిందువుల గురుంచి మాట్లాడితే..జైల్ లో పెడతారా.. నాకు జైలు కూడా ఇళ్లే. నేను హిందువును..నాకు రాజకీయం చెయ్యడం రాదు.  నాకు ఉరి వేయండి..నేను బ్రతికి ఉంటే  హిందువు గురుంచి మాట్లాడుతా..పోలీసులకు తల నొప్పిగా ఉంటా.. భారత్ దేశాన్ని  హిందూ దేశంగా చెయ్యాలని నా కల.  పోలీసులారా వినండి ఈ రోజు కాకపోతే రేపు చనిపోతా. హిందువు కోసం మాట్లాడితే నా  మీద కక్ష కడుతరా?..కేసులు పెడుతరా ? ..లవ్ జిహాద్ జరుగుతున్న వాటి మీద మాట్లాడితే నా  మీద కేసులు పెడుతున్నారు..అని రాజాసింగ్ అన్నారు. 

నా కొడుకును కిడ్నాప్ చేస్తారా..

శ్రీ రామ నవమి శోభ యాత్ర అయిపోయాక..నన్ను మళ్లీ జైల్ కు పంపుతారు. నాకు కాల్ చేసి నా  కొడుకు ను కిడ్నాప్ చేస్త అని బెదిరిస్తున్నారు. నేను చనిపోతే..నా  కొడుకు హిందువు సమాజం కోసం,ఈ దేశం కోసం మాట్లాడుతాడు. నేను బ్రతికి ఉన్నత వరకు హిందువుల గురించి తప్ప ఎవరి గురించి మాట్లాడా..అని రాజాసింగ్ అన్నారు.