బీజేపీ సర్కార్ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు: ఎమ్మెల్యే రెడ్యానాయక్

బీజేపీ సర్కార్ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు: ఎమ్మెల్యే రెడ్యానాయక్

బీజేపీ సర్కార్ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అన్నారు ఎమ్మెల్యే రెడ్యానాయక్. వచ్చే సెప్టెంబర్ లో ఎన్నికలు ఉండొచ్చుని..ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ సూచించారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ గర్తు చేశారు. మార్చి 28వ తేదిన మంగళవారం మాహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని రెడ్యానాయక్ తెలిపారు. 

ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి..ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని అభివృద్ది పనులు పూర్తి చేయాలని కేసీఆర్ అన్నారని రెడ్యానాయక్ గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో నేతలు సమన్వయంతో పని చేయాలని తమకు కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు రెడ్యానాయక్. ప్రజల సమస్యలు తెలుసుకొని..వారికి చేరువ కావాలని అందుకు ప్రతీ మండలం ఆత్మీయ సమేళనాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేరొన్నారు.