కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే రోజా సందడి

కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే రోజా సందడి

ఏపీలోని తిరుపతిలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో సందడి చేశారు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా. తిరుపతి ఇందిరా గ్రౌండ్ లో క్రీడాకారులతో ఉత్సాహంగా కబడ్డీ ఆడారు. రైడింగ్ కు వెళ్లి కబడ్డీ కూత పెట్టారు.  గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. జాతీయ క్రీడలు తిరుపతిలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు రోజా.