దళిత బాలికపై ఎందుకింత వివక్ష! న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు?

దళిత బాలికపై ఎందుకింత వివక్ష! న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు?

దళిత బాలికపై ఎందుకింత వివక్ష

ఖమ్మం బాలిక పట్ల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

75 శాతం కాలినగాయాల సీరియస్​గా ఉంటే సర్కార్ ​పట్టించుకోదా?

యశోద, అపోలోలో ఎందుకు ట్రీట్​మెంట్​ ఇప్పించరు?

బాధితురాలికి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు?

హైదరాబాద్, వెలుగు: 75 శాతం కాలిన గాయాలతో సీరియస్​గా ఉన్న దళిత అమ్మాయికి యశోద, అపోలో వంటి దవాఖానాల్లో సర్కార్ ఎందుకు ట్రీట్ మెంట్ ఇప్పించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. దారుణానికి గురైన13 ఏండ్ల అమ్మాయికి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకని మండిపడ్డారు.  దారుణానికి గురైన దళిత అమ్మాయి పట్ల ఇంత వివక్ష చూపిస్తారా అని టీఆర్​ఎస్​ సర్కార్​పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉస్మానియా హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఖమ్మం బాధిత బాలికను సీతక్క పరామర్శించారు. ‘దారుణం జరిగి 18 రోజులు అవుతోంది.. మెరుగైన వైద్యం కోసం బాధితులే సొంతంగా హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు వచ్చారు. సర్కార్​నుంచి వారికి ఏ సాయం కూడా అందడం లేదు’ అని విమర్శించారు. కనీసం ఒక్క ప్రజాప్రతినిధి, అధికారి వచ్చి ఎట్లుంది అని అడగలేదన్నారు. ఈ ఘటనలోని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పేదింటి ఆడపిల్లల రక్షణ సర్కార్ బాధ్యత కాదా.?

ఖమ్మం బాధిత బాలిక విషయంలో సర్కార్​ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నయి. రాష్ర్టంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని  ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బెటర్ ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన బాలికను బుధవారం పలువురు నేతలు పరామర్శించారు.  పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ  బాలికను పరామర్శించి, మంచి ట్రీట్​మెంట్ అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా  లెఫ్ట్​ నేతలు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 75 శాతం గాయాలతో విషమపరిస్థితిలో ఉన్న బాలికను బెటర్​ ట్రీట్​మెంట్​ కోసం ప్రభుత్వం కార్పొరేట్​ హాస్పిటల్లో చేర్పించకపోవడంపై మండిపడ్డారు. బాధితులే మెరుగైన వైద్యం కోసం సొంతగా హైదరాబాద్ వచ్చారన్నారు. ఓ పేదింటి బాలిక రక్షణ బాధ్యత సర్కార్​ది కాదా అని ప్రశ్నించారు. బాలికపై ఇంత అఘాయిత్యం జరిగితే  సీఎం, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రలు, ప్రజాప్రతినిధుల నోళ్లు మూగబోయాయా అని ప్రశ్నించారు. ఈ దారుణానికి పాల్పడ్డ కిరాతకుడిని ఉరి తీయాలని డిమాండ్​ చేశారు. ఇంత జరిగిన తరువాత కూడా కేసు పెట్టవద్దంటూ పంచాయితీ పెట్టిన పెద్ద మనుషులు అందరిని అరెస్ట్ చేయాలన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా15 రోజులపాటు సీక్రెట్‌‌గా ట్రీట్‌‌మెంట్ అందించిన పూజ హాస్పిటల్‌‌ లైసెన్స్‌‌ను రద్దు చేసి, మేనేజ్‌‌మెంట్‌‌ను అరెస్ట్ చేయాలన్నారు. బాధితురాలికి రూ.25 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలని, సర్కార్‌‌ వెల్ఫేర్ హాస్టల్‌‌లో ఉంచి చదివించాలన్నారు.

For More News..

నిమ్స్​లో ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ సెంటర్!

రాష్ట్రంలో మరో 1,896 కరోనా కేసులు

డబుల్ ఇల్లు ఇయ్యలేదని మంత్రి ఎదుట యువకుడి సూసైడ్ అటెంప్ట్