కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లే: సీతక్క

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లే: సీతక్క

ములుగు/కొత్తగూడ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లేనని మహిళా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా, చల్వాయి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి సీతక్క కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతున్నానని చెప్పారు. 

వరదల్లో నష్టపోయిన రైతులకు అండగా నిలిచానని, తనకు ఎన్ని ఉన్నత పదవులు వచ్చినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే కొందరు వ్యక్తులు ఓట్ల కోసం మోసపూరిత మాటలు చెబుతూ వస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​, మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘం అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులుగుజ్జు వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

అలాగే మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలంలోని జంగాలపల్లి, తాటినాగారం గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. కామారం ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బర్ల రాంభూపాల్‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, జడ్పీటీసీ ఈసం రమ, వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ వీరభద్ర పోతయ్య, నాయకులు ఈసం నర్సక్క, రాధారపు కొమురయ్య, రూప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, మొగిలి, సాంబయ్య పాల్గొన్నారు.