కాంగ్రెస్ భూములు పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటుంది..

కాంగ్రెస్ భూములు పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటుంది..

భూముల విలువ పెంపు పేరుతో దందా చేస్తున్న సీఎం కేసీఆర్.. దున్నే వాడికి భూమి లేకుండా చేస్తున్నాడని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఫార్మా సిటీ పేరుతో అడ్డగోలుగా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ అధికారులు సైతం భూములు లాక్కుంటూ.. పోడు రైతులపై దాడులు చేస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. 

ధరణి కారణంగా మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్లో 1800 ఎకరాలు ఆగమయ్యాయని సీతక్క ఆరోపించారు. భూమి అంటే తరతరాలుగా వచ్చే ఆధారమని, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని దూరం చేస్తోందని వాపోయారు. కాంగ్రెస్ భూములు పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు పంచుతోందని సీతక్క విమర్శించారు. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పుడు టీఆర్ఎస్ నేతల పేర్లకు మారుతున్నాయని మండిపడ్డారు.