
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. రామన్న గూడెం, వాడ గూడెం కరకట్ట దగ్గర గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీతక్క. కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని వాగుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు ఎమ్మెల్యే సీతక్క.