రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్, బీజేపీ ఆరాటం

రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్, బీజేపీ ఆరాటం

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా.. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పబ్ లు, క్లబ్ లు నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నా పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందన్నారు. పోలీసులను కేసీఆర్ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో కాకుండా విపక్షాలపై నిఘా నేత్రాలు మాత్రం బాగా పనిచేస్తున్నాయన్నారు.టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రోడ్లపైమర్డర్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సోనియ గాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కుతుందని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్..వారికి ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కులాలు,మతాల పేరుతో,ప్రాంతాల పేరుతో రాజకీయం ప్రయోజనం పొందటం టీఆర్ఎస్,బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.