నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యం : ఎమ్మెల్యే శ్రీగణేశ్

నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యం : ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: నవ కంటోన్మెంట్ నిర్మాణమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేశ్ పేర్కొన్నారు. సోమవారం వార్డు 3 పరిధిలోని బాలంరాయి, దండు మారెమ్మ దేవాలయ ప్రాంతం, అంబేద్కర్ సొసైటీ తదితర బస్తీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరాలో అంతరాయం, అధ్వాన్నంగా మారిన అంతర్గత రహదారుల గురించి బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందించిన ఆయన.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, ప్రజా సౌకర్యాల కల్పనే తన ప్రథమ కర్తవ్యమని హామీ ఇచ్చారు.