ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి
  •     సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా ప్రేమ్‌‌సాగర్ రావు 
  •     ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు

హైదరాబాద్ /నిజామాబాద్​/మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్‌‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌‌ రెడ్డి నియమితులయ్యారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్‌‌ రావును సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా నియమించారు. మంత్రి పదవులు ఆశించిన వీళ్లిద్దరికీ.. కేబినెట్‌‌ హోదాతో కీలక పదవులు అప్పగించారు. సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ ఫ్లాగ్‌‌షిప్, డెవలప్‌‌మెంట్ స్కీమ్స్ సలహాదారు బాధ్యతను అప్పగించారు.

 మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగానూ అవకాశం కల్పించారు. ఈ మేరకు మంత్రులకు ఉండే అన్ని సదుపాయాలను ఆయనకు కల్పిస్తూ జీవో జారీ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌‌లో ప్రత్యేక క్వార్టర్ సైతం కేటాయించారు. కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్​రావు మంత్రి పదవి ఆశించగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చాన్స్ దక్కలేదు. అప్పట్లో కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రేమ్‌‌సాగర్‌‌‌‌ రావు.. ప్రస్తుతం కోయంబత్తూర్‌‌‌‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన అనుచరులు తెలిపారు.