ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయండి : ఎమ్మెల్యే సదుర్శన్​రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయండి : ఎమ్మెల్యే సదుర్శన్​రెడ్డి

బోధన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఏరాజ్​పల్లి, అమ్దాపూర్  గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించకపోతే బిల్లు రాదని, వేరేవారికి కేటాయిస్తామని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఉర్దు అకాడమీ​ చైర్మన్ తాహెర్​ బీన్​ హందాన్​, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి అంజరెడ్డి, డీసీసీబీ డెలిగేట్ గంగాశంకర్, సబ్​ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్​ విఠల్ పాల్గొన్నారు.  

కాంగ్రెస్​.. రైతు ప్రభుత్వం

రెంజల్ (నవీపేట్ ), వెలుగు  : తమది రైతు ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రైతులకు విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు.  అనంతరం తహసీల్దార్ కార్యాలయం లో రికార్డులను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని తహసీల్దార్ శ్రావణ్ కు సూచించారు. ఎంసెట్ లో 2834 ర్యాంక్ సాధించిన అసం అనిల్ ను సత్కరించారు.  

ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ 

ఎడపల్లి,  వెలుగు : ఎడపల్లి తహసీల్దార్, ఎంపీడీవో  కార్యాలయాలను మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  తహసీల్దార్​ కార్యాలయానికి రాక పోవడం, ఎంపీడీవో సెలవులో ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు.  కలెక్టర్​తో ఫోన్ లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.