పార్టీ కోసం పనిచేసినోళ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా

పార్టీ కోసం పనిచేసినోళ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రిభువనగిరి జిల్లా: రామన్నపేట మండలంలోని రహదారులు భవనాల శాఖ ( R&B) అతిధి గృహంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చింపించేశారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ ప్లెక్సీలు పెట్టడం ఏంటని అధికారులపై  మండిపడ్డారు. ఎంపీ సూచనతో కార్యకర్తలు స్పందించి ఫ్లెక్సీలు.. పోస్టర్లను తీసేశారు. 
బయట్నుంచి వచ్చిన వ్యక్తులకు స్థానం లేదు
అనంతరం రామన్నపేట పట్టణంలోని జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలో ముందస్తు ఎన్నికలు రావచ్చు.. కాబట్టి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ కోసం పని చేసిన స్థానికులకే మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇపిస్తా.. బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు స్థానం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కాడి నుంచి ఈ మండలంలో ఒక్క ఈ కొత్త ఇల్లు కట్టించలేక పోయారని ఆయన ఆరోపించారు. వడ్లు వెయ్యొద్దు అన్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆయన విమర్శించారు. దళిత బంధు పధకంను పక్కకు నెట్టడానికే వడ్ల డ్రామా ఆడిండు, ఏ రాష్టంలో లేని వడ్ల లొల్లి మన రాష్టంలో ఎందుకోచిందో ప్రజలకు అర్ధమైందన్నారు. 
అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. నియోజకవర్గంలో ధర్మారెడ్డి, పిలయపల్లి, బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టులు నేటికి పూర్తి చేయలేక పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు నిర్వమించాలని నాయకులకు ఆదేశించారు.  గ్రూప్ రాజకీయాలు నకిరేకల్ లో ఉండబోవని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో కాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు నేటికి చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని..   హైదరాబాద్ లో పబ్బులు , బార్లు తెరిచి ఉంచుతున్నారు. వాటి ద్వారానే కరోనా విజృంభిస్తోందన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రజలను విభజించి పాలిస్తున్నారు

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

మెడికల్ షాపుల్లోకంటే.. ఆన్ లైన్ లో తక్కువ ధరకే మెడిసిన్​