షమీపై పుస్తకం రాస్తున్న ఎమ్మెల్యే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న హసీన్ జహాన్ ప్రస్తావన!

షమీపై పుస్తకం రాస్తున్న ఎమ్మెల్యే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న హసీన్ జహాన్ ప్రస్తావన!

టీమిండియా పేసర్  మహ్మద్ షమీపై త్వరలో ఓ పుస్తకం రానుంది. ఆ పుస్తకాన్ని రాసేది ఎవరో  కాదు ఓ పొలిటీషియన్.. అవును ఉత్తరాఖాండ్ లోని ఖాన్‌పూర్ నియోజకవర్గానికి  చెందిన ఉమేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాస్తున్నారు.  30 డేస్ విత్ షమీ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రాస్తున్నట్లుగా ఉమేష్ కుమార్ వెల్లడించారు.  ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో ఉమేష్ మాత్రం  వెల్లడించలేదు.  

ఈ పుస్తకంలో  షమీ గురించి ఏ ఆంశాలను ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   కేవలం క్రికెట్ లోకి షమీ ఎలా వచ్చాడు. ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో మాత్రమే వివరిస్తారా?  షమీ భార్య హసీనా జహాన్ గురించి ఏమైనా ప్రస్తావనా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  షమీతో హసీనా  గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

షమీపై  హసీనా  తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. మరి వీటిని ఈ పుస్తకంలో పొందుపరుస్తారో లేదో చూడాలి. మరోవైపు వరల్డ్ కప్ లో  మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు జట్టు్కు షమీ  మొయిన్ పిల్లర్ గా మారాడు.