బుడుందేవ్ ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

బుడుందేవ్ ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
  •     ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఇంద్రవెల్లి,(ఉట్నూర్) వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంపూర్​లో కొలువుదీరిన బుడుందేవ్ జాతర మెస్రం వంశీయుల పూజలతో ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. జాతర ప్రారంభోత్సవంలో  ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చీఫ్​గెస్ట్​గా పాల్గొన్నారు. బుడుందేవ్​కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బుడందేవ్ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మిస్తానని, ప్రత్యేక మరుగుదొడ్లు, నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక బోర్​వెల్ వేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్​కు చెందిన నాగేంద్ర ఆధ్వర్యంలో మెస్రం వంశీయుల మహిళలకు చీరలు అందజేశారు. కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, కటోడాలు మెస్రం కోసు, హనుమంతు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.