మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను సందర్శించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీళ్లు ఇవ్వడానికి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. గోదావరి నీళ్ళు రావడం వల్ల బెల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరబోతుందన్నారు.
Also Read :- కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచండి
సాధ్యమైనంత తొందరగా గోదావరి నీళ్ళు సప్లైకి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా గోదావరి వాటర్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.