ప్లేట్ల కోసం బీఆర్ఎస్ కార్యకర్తల కుమ్ములాట.. మెడ పట్టుకొని గెంటేసిన నేతలు

ప్లేట్ల కోసం బీఆర్ఎస్ కార్యకర్తల కుమ్ములాట.. మెడ పట్టుకొని గెంటేసిన నేతలు

బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లా..మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో ఏప్రిల్ 10వ తేదీ సోమవారం నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది.

మీటింగ్ కు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరైయ్యారు. అయితే ఈ సమ్మేళనంలో భోజనం చేసే ప్లేట్ల కోసం కార్యకర్తలు కుమ్ములాడారు. లంచ్ టైం కావడంతో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతుండగానే కార్యకర్తలు భోజనానికి వెళ్లిపోయారు. కార్యకర్తలు ఒపికగా ఉండాలని నేతలు చెప్పినా వినకుండా బోజనం ప్లేట్ల కోసం గందరగోళం చేశారు.  ఖాళీ కుర్చీలకు నేతల ప్రసంగం వినిపించారు. మరోవైపు ఎమ్మెల్యే ముందే కార్యకర్తలను మెడ పట్టి గెంటేశారు బీఆర్ఎస్ నేతలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రతి కుటుంబానికి అందించామన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, స్మశాన వాటికలు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు మన ఊరు మనబడి మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.