డీఎస్ మృతికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంతాపం తెలిపారు. డీఎస్ కాంగ్రెస్ కు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్(75) ( ధర్మపురి శ్రీనివాస్) ఇవాళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ (జూన్ 29) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
