మా డబ్బులతో స్టేడియం కట్టిస్తే.. నా పోస్టే పీకేశారు: వివేక్ వెంకటస్వామి

మా డబ్బులతో స్టేడియం కట్టిస్తే.. నా పోస్టే పీకేశారు: వివేక్ వెంకటస్వామి

రాజకీయాలకు అతీతంగా వచ్చేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.  చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలం రామకృష్ణ పూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో  కాక వెంకటస్వామీ టోర్నమెంట్ లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీ కృష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. హైదరాబాద్ లో  తమ డబ్బులతో ఉప్పల్ స్టేడియం కట్టిస్తే..  డబ్బులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమకు స్పాన్సర్ షిప్ రైట్స్ ఇవ్వాలని  అగ్రిమెంట్ లో కూడా ఉందన్నారు.  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో తమ రైట్స్ తీసేసుకుని. తనను పదవి నుంచి కూడా తొలగించారని చెప్పారు.  యువతకు మంచి పని చేశాము కానీ పేరు రాలేదన్నారు. తాము  HCA  అధ్యక్షులుగా పనిచేసి క్రికెట్ ను మారు మూల గ్రామాలకు తీసుకువెళ్ళామన్నారు.  అవకాశాలు కల్పిస్తే మారు మూల ప్రాంతాల వారు కూడా వచ్చి ఆడుతారని చెప్పారు.

ఉప్పల్ స్టేడియానికి కృషి చేసింది వారిద్దరే: వంశీకృష్ణ

వివేక్ వెంకటస్వామి, వినోద్ కు,  క్రికెట్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ యువ నేత  గడ్డం వంశీ కృష్ణ. ఉప్పల్ స్టేడియం స్థాపించడానికి కృషి చేసింది వీరిద్దరేనన్నారు.  దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి క్రికెట్ ఆడాలని కోరిక ఉంటుంది.. దానికి అనుగుణంగా  కాక వెంకటస్వామి కృషి చేశారు.అదే బాట లో  మేము మా తండ్రి వివేక్ వెంకటస్వామి పాటుపడుతున్నారని వంశీ కృష్ణ తెలిపారు. 
 

ALSO READ :- ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి రష్యా విప్లవానికి సంబంధం ఏంటి?