పెద్దపల్లి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్ నిర్మాణానికి సహకరించండి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్, విజయరమణారావు

పెద్దపల్లి  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్ నిర్మాణానికి సహకరించండి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్, విజయరమణారావు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్​పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​నాయుడును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

పెద్దపల్లి జిల్లా భౌగోళిక పరిస్థితులు, పరిశ్రమలు, జనాభా, రవాణా అవసరాలు, తదితర అంశాలను వారు మంత్రికి వివరించారు. ఎయిర్​పోర్టు ఏర్పాటుతో జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సాంకేతిక అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. 

కరీంనగర్ సిటీ, వెలుగు: ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ సమీపంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు సర్వే చేయించాలని కోరారు. గతంలో సర్వే చేసినా ఆ తర్వాత పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో అధికార బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి కూడా ఉన్నారు.