హైదరాబాద్, వెలుగు: తమ హెచ్చరికల వల్లే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేటి తెలంగాణ టూర్‌ను వాయిదా వేసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు తేజస్వి సూర్యను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. పర్యటన వాయిదా వేసుకున్నంత మాత్రాన ఆయనను వదిలిపెట్టబోమన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణను కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
