పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మే 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం.. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంది. మూడు ఉమ్మడి జిల్లాల్ల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ ఉప ఎన్నికలో 4 లక్షల 63 వేల839 మంది పట్టభద్రులు ఓటర్లు తమ ఓట హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఓటర్లలో..  లక్షా75 వేల645 మంది మహిళా ఓటర్లు ఉండగా..  2 లక్షల 88వేల 89 మంది పురుషులు, ఐదుగురు  ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్,  బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్యే తీవ్ర పోటీ ఉంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది... జెంబో బ్యాలెట్ కావడంతో లెక్కింపుకు కనీసం మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.