
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కుటుంబ పాలన అంతం అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ తన పనితనం మీద విశ్వాసం లేదా ఎందుకని పీకేను తీసుకోవచ్చిండని ప్రశ్నించారు. అటు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల పైన జీవన్ రెడ్డి ఫైర్ ఆయ్యారు. అమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచం ముందు దేశం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. తాము కూడా శ్రీ రాముడి భక్తులమేనని, కానీ ఇస్లాం మతాన్ని కించపరచమని తెలిపారు. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆమె నోరు నుంచే వచ్చినా... ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆలోచన విధానానికి ప్రతిబింబమని అన్నారు.