వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

సమస్యల పరిష్కారం  కోసం సిరిసిల్లలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గత 45 రోజులుగా వీఆర్ఏలు న్యాయబద్దంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి రెండేండ్లు గడుస్తున్నా వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకోవడానికి మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఅర్ఏలు  కోరుకునేది పేస్కేల్, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మాత్రమే అన్నారు. 

సుప్రీం కోర్టు ఆర్డర్లను తెలంగాణ ప్రభుత్వం ధిక్కరిస్తుందన్నారు. వీఅర్ఏ లు ప్రమోషన్ మీద వారి అర్హత మీద జూనియర్ అసిస్టెంట్ హోదా ఇవ్వాలన్నారు. వారసత్వ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అశోక్ అనే వ్యక్తి మృతి చెందినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కార్మికులకు చెల్లిస్తున్న వేతనం కూడా వీఅర్ఏలకు ఇవ్వటం లేదని విమర్శించారు. శాసన మండలిలో వీఆర్ఏల సమస్యలపై గళమెత్తుతానని ఎమ్మెల్సీజీవన్ రెడ్డి తెలిపారు.