దృష్టి మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు

దృష్టి మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు

కేంద్రం నుంచి హక్కులు సాధించుకోలేకపోవడం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కు మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్యూలర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. బీజేపీకి ఎన్నో అంశాల్లో మద్దతిచ్చిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందలేకపోవడానికి కారకులెవరో చెప్పాలని అన్నారు. 2020 వరకు బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని మండిపడ్డారు. 

తెలంగాణ పట్ల సానుకూల వైఖరి కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ఘనత తమ పార్టీ సొంతమని అన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని తేల్చిచెప్పారు. హక్కులు సాధించుకోలేక దేశాలు పట్టుకొని తిరుగుతుండని జీవన్ రెడ్డి విమర్శించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని చూస్తే ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

For more news..

కేంద్రంలో మార్పు తథ్యం

మహిళా ఎంపీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు