అదనపు తూకం నిలిపి వేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

అదనపు తూకం నిలిపి వేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో అదనపు తూకం నిలిపి వేయాలని..భూ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్, రైతు సమస్యలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయికల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా జీవన్ రెడ్డి శివాజీ విగ్రహం నుండి బైక్ ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కోరుట్లలో మిల్లర్లు అధిక తూకం వేస్తే.. ఫ్యాక్స్ సీఈవోపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. రాయికల్ మార్కెట్ స్థలంలో సమీకృత మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు తూకంతో రైతులు క్వింటాల్ కు 5 కిలోలు నష్టపోతున్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు కష్టపడాల్సి వస్తోందన్నారు. ధరణితో భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.