షర్మిల పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటరా.? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

షర్మిల పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటరా.? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హై కోర్టు అనుమతి ఉన్నా షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంలో పోలిసుల అతి చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మెదక్ కదిర్ ఖాన్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలిపారు. ఈ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడాన్ని ఖదిర్ మృతికి ఒక ఆధారమని ఆరోపించారు. కేసును తక్షణమే హై కోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని డిమాండ్  చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు సమాజానికి జవాబు దారులుగా ఉండాలన్నారు. జగిత్యాల నర్సింగాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు విషయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఎందుకు నిర్లక్యమని ప్రశ్నించారు. నిందితుడు న్యాయవాది వృత్తిలో ఉన్నాడు సభ్య సమాజం దీనిని తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు నిందుతున్నిఅదుపులోకి తీసుకోలేదు..చట్టపరంగా విచారణ లేదని తెలిపారు. పోలీసులు సమాజంలో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కోరారు. పోలీసులు నిందితున్ని చుట్టంలా చూస్తున్నారని మండిపడ్డారు.