కలికోట నుంచి మూడేళ్ళవుతున్నా తట్టెడు మట్టి తీయలేదు

 కలికోట నుంచి మూడేళ్ళవుతున్నా తట్టెడు మట్టి  తీయలేదు

కలికోట సూరమ్మ ప్రాజెక్టు ప్రారంభించి మూడేళ్ళవుతున్నా తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రాజెక్టులను పూర్తి చేయమంటే.. షోకేస్ తీగల వంతెనలు వేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మానేరు రివర్ ఫ్రంట్ ల గురించి ఈ కేసీఆర్ సర్కారు గొప్పలకు పోతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి అవసరాలను మర్చిపోవడం క్షమించరాని నేరమన్నారు. పంటమార్పిడి గురించి చెబుతున్న ఈ సర్కారు.. లక్ష ఎకరాల్లో పండే చెరకు గురించి ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రైవేట్ యాజమాన్యం నుంచి తప్పించి పూర్తిగా సర్కారే నిర్వహించేలా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పినా చేయలేదన్నారు.  కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను రైతులకు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మొక్కజొన్నను కేంద్రం నిర్ణయించిన రూ.1850 రూపాయల మద్దతు ధరకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. సమస్యలపై గళమెత్తితే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు.