హరీశ్.. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 హరీశ్.. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ఆగస్టు 15 లోపు  ..ఎక్కువ మొత్తంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు  కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంటబీమా చెల్లిస్తుందని చెప్పారు.వరికి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు.

 తెలంగాణలో కనుమరుగైన బీఆర్ఎస్ పార్టీ గురించి తాము ఆలోచించడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం అవకాశవాదానికి నిదర్శనమన్నారు.  కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉందన్నారు. ఆగస్ట్ 15 లోపు  ఒకే సమయంలో   రెండు లక్షలు చెల్లించాలనే మంత్రి వర్గ నిర్ణయం తీసుకోవడంపై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలన్నారు. కేటీఆర్, హరీశ్ రాజీనామా పత్రం పట్టుకుని సిద్ధంగా ఉండాలన్నారు.