రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతోనే ధరణిలో తప్పులు

రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతోనే ధరణిలో తప్పులు

ధరణి లోపాల పుట్ట అని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి  ఆరోపించారు. ధరణి పోర్టల్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం, యజమాని పేరు స్థానంలో గ్రామాల పేరు రావడంపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 90 శాతం తప్పులు రెవిన్యూ యంత్రాంగం వల్లనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి  వెళ్లినా వందల సంఖ్యలో భూ సమస్యలు ఉన్నాయన్నారు.నాలుగేండ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం  కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ఏం అధికారం ఉందని వాళ్ళ ఆధ్వర్యంలో భూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని..ప్రజావాణి లో సమస్యలు పరిష్కారం కాకుంటే వాటిని నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాల్లో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.