మునుగోడులో కాంగ్రెస్ పార్టీదే విజయం

మునుగోడులో కాంగ్రెస్ పార్టీదే విజయం

మునుగోడులో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆ సీటులో కాంగ్రెస్ గెలిచిందని..మళ్లీ కాంగ్రెస్సే దక్కించుకుంటుందని చెప్పారు. మునుగోడులో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ నుంచి రాజ్ గోపాల్ రెడ్డి ఎందుకు బయటికెళ్లారో..ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. 

తెలంగా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లను బహిరంగ వేలానికి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలన్న..తెలంగాణాలో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.