దళితబంధు, హౌసింగ్ స్కీంలు అనేవి జీరో ఫర్ఫామెన్స్: జీవన్ రెడ్డి

దళితబంధు, హౌసింగ్ స్కీంలు అనేవి జీరో ఫర్ఫామెన్స్: జీవన్ రెడ్డి

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూ.20వేల కోట్లు వచ్చే రాబడి భూములను కోల్పోయామని ఆయన చెప్పారు. ఈసారి NRGS బడ్జెట్‭లో రూ.89వేల కోట్ల నుండి రూ.60వేల కోట్లకు కుదించారని గుర్తు చేశారు. 2022 23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ.17వేల కోట్లు కేటాయించారని.. కాని ఇప్పటివరకు ఒక్క లబ్దిదారుని గుర్తింపు కూడా జరగలేదన్నారు.

మంత్రి కొప్పుల తన నియోజకవర్గంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాడ్ చేశారు. హౌసింగ్ స్కీం కొరకు రూ.12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఇళ్లు కట్టుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామన్నారు. కాని అది కూడా ఇప్పటివరకూ ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, హౌసింగ్ స్కీం అనేవి జీరో ఫర్ఫామెన్స్ అని వీటికి మళ్లీ బడ్జెట్‭లో అదే రిపీటైందన్నారు. గత 4 సంత్సరకాలంగా బిసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ బడ్జెట్ జీరో అని చెప్పారు. 2022 23లో ఇచ్చిన వాగ్దానాలను ముందు నెరవేర్చాలని జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.