
= నాపై దుష్ప్రచారం సరికాదు
= 47 సెగ్మెంట్లలో పర్యటించాను
= గ్రౌండ్ రిపోర్టు ఆధారంగానే సామాజిక తెలంగాణ
= రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా
= నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నా
= చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ‘ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా నన్ను కష్టపెడతారా? రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా’ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ప్రజల అభిప్రాయాలు సేకరించానని చెప్పారు. ఉన్న పరిస్థితులు ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని అన్నారు.
పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని , ఈ సమయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని అన్నారు. తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని, తనపై దుష్ప్రచారం తగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నట్టు కవిత చెప్పారు.